Wednesday, January 22, 2025

పెళ్లి నిశ్చయం… యువతిని చంపి బావిలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: యువతికి పెళ్లి నిశ్చయం కావడంతో యువకుడు ఆగ్రహం ఆమెను చంపి బావిలో పడేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం బర్గార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిపల్లి గ్రామంలో రింకి (15) అనే అమ్మాయి ఉంది. ఆమెకు పెళ్లి నిశ్చయం కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. మార్చి 15న రింకి కనిపించకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇండ్లో ఎంత వెతికినా ఆమె కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చంద్రశేఖర్ సేతుపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సేతును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేసి బావిలో పడేశానని చెప్పాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రింకికి పెళ్లి నిశ్చయం కావడంతో చంద్రశేఖర్ సేతు పగతో రగిలిపోయాడు. మార్చి 15న బయట కలుద్దామని ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. రింకి గొంతు నులిమి చంపి అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశానని చెప్పాడు. అతడు ఆమెను గాఢంగా ప్రేమించడంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News