Wednesday, January 22, 2025

ఆపద సమయంలో అంబులెన్స్ లేక అవస్థలు

- Advertisement -
- Advertisement -

కోహెడ: ఆపద సమయంలో అంబులెన్స్ లేక రోగులు ఎన్నో అవస్థలు పడుతున్నారని సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన యువత ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి, ధర్నా నిర్వహించారు. కోహెడ మండల కేంద్రానికి 108 అంబులెన్స్ ఏ ర్పాటు చేయాలంటూ ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 4 గంటలకు పైగా యువకులు రోడ్డుపై బైఠాయించి, అంబులెన్స్ మంజూరి చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ… ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా జరిగితే మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను జిల్లా కేంద్రాలకు తరలించడానికి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు.

అంబులెన్స్ లేకపోవడంతో ప్రత్యామ్నా యం ఏర్పాటు చేసుకునే లోపే పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన చెందారు. ఫిబ్ర వరి 25న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నెల లోపు కోహెడ మండలానికి 108 అంబులెన్స్ వాహనం మంజూరి చేసి, ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని.. నేటి వరకు హామీ అమలు చేయలేదని యువకులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కోహెడ మండల కేంద్రానికి అంబులెన్స్ ఏర్పాటు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. అంబులెన్స్ మంజూరి చేసే వరకు మా పోరాటం ఆగబోదని.. మండల ప్రజలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా దాదాపు 4 గంటలుగా రోడ్డుపై బైఠాయించి యువత నిరసన వ్యక్తం చేస్తున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి స్పందించక పోవడం కొసమెరుపు. ఈ ధర్నాలో కోహెడ మండలానికి చెందిన యువకులు పాల్గొన్నారు.
ప్రేక్షక్ష పాత్ర పోషించిన పోలీసులు
కోహెడ మండల కేంద్రానికి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని యువకులు దాదాపు 4 గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ధర్నా ప్రారంభమైన సుమారు ఒక గంట తర్వాత పోలీసులు అంబేద్కర్ చౌరాస్తాకు చేరుకొని, యువకులను ధర్నా విరమించాలని చెప్పారు. స్ఫష్టమైన హామీ వచ్చేవరకు ధర్నా విరమించబోమని యువకులు చెప్పడంతో పోలీసులు చేసేది ఏమిలేక ప్రేక్షక పాత్ర పోషించారు.
దాదాపు 4 గంటలు సుదీర్ఘంగా యు వకులు రోడ్డుపై బైఠాయించి అంబులెన్స్ మంజూరి చేయాలంటూ నిరసన చేశారు.
ఆదివారం అంగడి కావడంతో రాకపోకలకు కొంత ఇబ్బందులు ఎదురైనాయి. 4 గంటల నిరసన అనంతరం పోలీసులు యువకులను రోడ్డుపై నుండి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News