Sunday, December 22, 2024

మద్యం మత్తులో దాడి చేసిన యువకులు

- Advertisement -
- Advertisement -

ఇంటి ఎదుట మద్యం తాగవద్దని అన్నందుకు ఓ వ్యక్తిపై దాడి చేసిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…శుక్రవారం తెల్లవారుజాము రాత్రి రెండు గంటల సమయంలో శంకు యాదవ్, వంశీ, షాహిద్ ,హరీష్, సోను, సుమన్, కొంత మంది యువకులు కలిసి చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో నేతాజీ నగర్ లో ఉన్న ఒక ప్రైవేట్ ప్లేస్ లో కూర్చొని మందు తాగుతున్నారు. ఇది చూసిన ఎదురింటి వ్యక్తి వచ్చి ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు అని చెప్పాడు. దీంతో మద్యం తాగుతున్న యువకులు ఆ వ్యక్తితో గొడవపడ్డారు, ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అని చెప్పి మద్యం తాగుతున్న వారి ఫొటోలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మద్యం తాగిన యువకులు సదరు వ్యక్తి ఇంటిపైకి వెళ్లి కిటికీల అద్దాలు రాళ్ళతో పగలగొట్టి గట్టిగా కేకలు వేయడంతో వారు భయంతో బయటికి రాలేదు. తర్వాత యువకులు అక్కడే కూర్చుని మద్యం తాగారు.

ఆ ఇంట్లో అద్దెకు ఉండే ఓ వ్యక్తి ఇంటి యజమాని జనార్దన్ నాయుడుకు ఫోన్ చేసి ఇంటి అద్దాలను కొంతమంది వ్యక్తులు వచ్చి పగలగొట్టారని చెప్పాడు. వెంటనే అక్కడికి వచ్చిన జనార్దన్ నాయుడు పగుల గొట్టిన అద్దాలను పరిశీలిస్తుండగా, తాగి మైకంలో ఉన్న యువకులు అక్కడికి వచ్చి జనార్దన్‌పై కర్రలు, రాళ్లతోటి దాడి చేశారు. ఇది చూసిన చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి వస్తుండగా నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడికి వచ్చిన స్థానికులు గాయపడిన జనార్ధన్ నాయుడును పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారిపై 143,147, 307, 452, 506 R/w 149 ఐపిసి కింద కేసు నమోదు చేసి వారిలో ఏడుగురిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News