Monday, December 23, 2024

వైట్నర్ మత్తులో యువకుల వీరంగం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అజంపురాలో వైట్నర్ మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న వారిపై , దుకాణాలపై యువకులు దాడి చేశారు. అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడుతూ వారి పై దాడికి దిగారు. హోంమంత్రి మహమ్మద్ అలీ ఇంటి సమీపంలో పోకిరిలు రెచ్చిపోయారు.అజంపురా చమాన్ ప్రాంతంలో దుకాణదారులు విచ్చలవిడిగా వైట్నర్ అమ్మకాలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్నర్ అమ్మకాల పై పోలీసులు చర్యలు తీసుకొని  వాటిని నియంత్రించాలని ప్రజలు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News