హైదరాబాద్ : భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు పంత్ కు సాయపడ్డారు. ప్రమాదానికి గురైన కారు కాలిపోతున్న సమయంలో పంత్ వస్తువులు, నగదును ఇద్దరూ బయటకు తీశారు. వారే రజత్ కుమార్, నిషు కుమార్ అలా ప్రమాద సమయంలో కారులోంచి తీసిన రూ. 4వేలను పోలీసులకు వారు అందించారు. వీరి నిజాయితీకి పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా.. కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బిసిసిఐ తెలిపింది.
పంత్ ఆరోగ్యం కుదటపడడంతో ఐసియు నుంచి నార్మల్ వార్డుకు వైద్యులు షిఫ్ట్ చేశారని పేర్కొంది. డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో పంత్ చికిత్స తీసుకుంటున్నాడు. నుదిటిపై రెండు చోట్ల గాయాలయ్యాయని, కుడి మోకాలు వద్ద బెణకడంతో పాడు మణికట్టు, చీలమండలం, బొటనవేలు వద్ద ఆపరేషన్ చేశామని వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పంత్ తన కారులో ఢిల్లీ నుంచి రూర్కీ వస్తుండగా నర్సాన్ సరిహద్దులోని హమ్మద్‌పూర్ ఝాల్ గ్రామంలో డివైడర్‌ను కారు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఓ బస్సు డ్రైవర్, కండక్టర్ వెంటనే స్పందించి పంత్‌ను కారులో నుంచి బయటకు తీశారు. కారు చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో కాలిపోయి బూడిదగా మారింది.