విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్న మన సిద్దిపేట..
ఈ ప్రాంత యువతి యువకులకు ఉపాధి కల్పనకు ఐటి టవర్… పరిశ్రమలు ఏర్పాటు..
రేపటి పార్టీ సారథులు అభివృద్ధి ప్రచారకులు విద్యార్థి యువతనే..
పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధులు యువత విద్యార్థి నాయకులే…
ప్రతి విద్యార్థి , యువ నాయకులకు సముచిత స్థానము ఉంటుంది.
పటిష్టమైన విద్యార్థి కమిటీల వేయాలి.. నవ విద్యార్తి నాయకత్వాన్ని పరిచయం చేయాలి…
సిద్దిపేట నియోజకవర్గంలోని విద్యార్థి విభాగం కమిటీ లపై దిశానిర్దేశం చేసిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: సిద్దిపేటలో విద్యా ప్రమాణాలు ఉన్నత సాంకేతిక విద్య నిలయాలుగా రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని మంత్రి హరీష్ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థి యువ నాయకులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. సిద్దిపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ వి కమిటి లు పటిష్టంగా వేయాలని సూచించారు. సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్నది అని, ప్రభుత్వం డిగ్రీ కళాశాల వరకు ఉన్న మన సిద్దిపేటలో ఉన్నత సాంకేతిక విద్యను ప్రోత్సాహించే విధంగా నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, అగ్రికల్చర్ విద్యను అందిపుచ్చుకునేల మొక్క జోన్న పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు. వైద్య విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించేలా సిద్దిపేట మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని, కొత్తగా నర్సింగ్ కళశాల, మహిళ డిగ్రీ కళాశాల, పిజి కళాశాల వెటర్నరీ కళాశాల, మైనార్టీ రెసిడెన్షియల్, మండలానికి ఒక మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు, రాబోయే రోజుల్లో పరిశ్రమలు రాబోతున్నాయని హరీష్ రావు తెలిపారు. యువతి యువకుల ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఐటి టవర్ ని ఏర్పాటు చేసుకున్నామని ఈ విధంగా నియోజకవర్గాన్ని విద్యాక్షేత్రంగా విరాజిల్లెల అభివృద్ధి చేసుకున్నామని, ఇది అంత కూడా మన ప్రాంత విద్యార్థుల కోసం మన యువకుల కోసమేనని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో యువ విద్యార్థులుగా మీ పాత్ర ఎంతో ఉందని.. మీరే అభివృద్ధి ప్రచారకులు.. పార్టీ కి ప్రభుత్వానికి వారధులు అని హరీష్ రావు ప్రశంసించారు.
విద్యార్థి కమిటీలు పటిష్టంగా వేయాలి.. నవ విద్యార్థులను ప్రోత్సాహించాలి..
సిద్ధిపేట నియోజకవర్గంలో రాబోయే విద్యార్థి కమిటీలు పటిష్టంగా వేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.. మండలాల వారిగా, పట్టణంలో సమన్వయ కమిటీ వేయాలని , ఆ సమన్వయ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని.. కొత్తగా చురుగ్గా ఉండే విద్యార్థులను మన విభాగంలోకి ఆహ్వానించాలని చెప్పారు. సీనియర్ లు గా ఉన్న యువ నాయకులు పార్టీలో, విద్యార్థి నాయకులు యువత కమిటీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, నాయకులు రాజనర్సు, పాల సాయిరాం, మచ్చ వేణు గోపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, శేఖర్ గౌడ్, మహేష్ రెడ్డి ప్రశాంత్ గౌడ్, మెరుగు మహేష్ తదితరులు ఉన్నారు.