Monday, December 23, 2024

యువత నిర్ణయాలు భవితరానికి మార్గ దర్శకం

- Advertisement -
- Advertisement -

ఉన్నత ఉద్యోగాల కోసం నగరానికి రావడం సంతోషకరం
టూరిజం ప్లాజాలో యువ ఆత్మీయ సమ్మేళనం
యువతతో కలిసి ముచ్చటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మన తెలంగాణ / హైదరాబాద్: యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సి అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ధర్మపురి నియోజకవర్గ యువతతో ఆదివారం నాడు టూరిజం ప్లాజలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విద్యా విధానం నియోజకవర్గ స్థితిగతులపై చర్చించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి లో అగ్రగామిగా నిలిచాందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో యువత అందదండలతో ఇది సాధ్యం అయ్యిందని అభిప్రాయపడ్డారు. యువత తీసుకుంటున్న నిర్ణయాలతోనే ప్రజల్లో మార్పు వస్తుందని చెప్పారు. నాయకులు ఎక్కడ గొప్పగా ఆలోచన చేస్తారో అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. ఇందుకు యువత ప్రోత్సాహం కూడా ఉపయోగ పడుతుందని మంత్రి చెప్పారు.

ఉన్నత చదువులు, ఉద్యోగ ఉపాధి కల్పనకోసం యువత హైదరాబాద్ నగరంలో స్థిరపడటం సంతోష కరమైన విషయమన్నారు. గత పాలకులు పల్లె సీమల అభివృద్ధిని విస్మరించాయని ఇది గుర్తించిన సిఎం కెసిఆర్ పెరిగిన జనాభాకు అనుగునంగా జిల్లాల సంఖ్య పెంచి మౌలిక సదుపాయాలు కల్పించారని వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారాన్నారు. నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచారని చెప్పారు. భావితరం ఆలోచన చేసే విధంగా యువత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఒక సారి గుర్తించాలన్నారు.

యువత తీసుకోబోతున్న ఒక మంచి నిర్ణయం వెనుక అనేక మంది జీవితాలు మారుతాయనేది గమనించాలన్నారు. గత పాలకులు ప్రజలు, యువత కోసం ఆలోచన చేయక పోవడంతోనే అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇది గమనించిన సిఎం కెసిఆర్ ఆ దిశగా ఆలోచన చేసి ఇప్పుడు అభివృద్ధికి ప్రగతి కారకులయ్యారని దీనిని యువత అర్ధం చేసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో నూ గతంలో ఆధారించిన విధంగా యువత అంతా సహకరించాలని కోరారు. అప్పుడే మనం కోరుకుంటున్న విధంగా ప్రభుత్వ పధకాలు అన్నీ వర్గాలవారికి అందుతయని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న యువత అంతా కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గం నుంచి తిరిగి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీ తో గెలిపించు కుంటామని చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనం లో ధర్మపురి నియోజకవర్గం కు చెందిన యువకులు కుంటాల రమేష్,గంగాధర్, అశోక్. భాగ్యతో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News