Monday, November 18, 2024

బహుజనులు ఐక్యం కావాలి: ఎర్ర కామేష్

- Advertisement -
- Advertisement -

Youths joined in BSP

మనతెలంగాణ/పాల్వంచ రూరల్ : రాజ్యాధికారం దిశగా సాగాలంటే బహుజనులు ఐక్యం కావాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ అన్నారు. పాల్వంచ మండల పరిధి యానంబైల్ పంచాయితీలో సోమవారం ఆ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా పలువురు ఆపార్టీలో చేరారు. వారికి బిఎస్పి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఎర్ర ఆహ్వానించారు. అనంతరం మీడియా ఆయన మాట్లాడారు. నేటి అగ్ర వర్గాల పాలకులు బహుజనులను విభజించి పాలిస్తూ వారికి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే మనమంతా ఐక్యంగా ఉద్యమించాలని ఎర్ర పిలుపునిచ్చారు. అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలలో బహుజనులను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అభివృద్దికి నోచుకోని ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాలు అభివృధ్ది చెందాలంటే వారికి రాజ్యాధికారం దక్కాలన్నారు. అది కేవలం బిఎస్పీతోనే సాద్యపడుతుందన్నారు. కావునా బిఎస్పీ పార్టీని బలోపేతం చేసేందుకు మనమంతా ఐక్యతతో కృషిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎస్.కే.యూసూఫ్,పట్టణ ప్రసిడెంట్ కోళ్ళపూడి ప్రవీణ్,ముదిగొండ జయంత్,ఏడెల్లి శ్రీనివాస్,కుంజా శ్రీను,చంటి,శంకర్,చపాల భుజంగరావు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News