Thursday, January 9, 2025

ఏపీలో యూట్యూబ్ అకాడమీ: సిఎం చంద్రబాబు చర్చలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / అమరావతి: ఏపీలో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు. ఆన్ లైన్ ద్వారా యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో ఆన్ లైన్ చర్చలు జరిపినట్లు సీఎం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు యూట్యూబ్ ను ఆహ్వానించారు. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఎపిఎసి హెడ్ సంజయ్ గుప్తాలతో చంద్రబాబు నాయుడు మంగళవారం ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.

లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆయన వారిని ఆహ్వానించారు. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై ప్రత్యేకంగా అకాడమీలో పరిశోధనలు చేయవచ్చన్నారు. అమరావతిలో భాగమైన మీడియా సిటీలో దీనిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News