లండన్: కోవిడ్ వ్యాక్సిన్‌లతో పాటు అన్ని ఆమోదిత వ్యాక్సిన్ లపై తప్పుడు సమాచారం ఇచ్చేలా ఉన్న అన్ని విషయాలను యూట్యూబ్ బ్యాన్‌చేసినట్లు ఆ మీడియా సంస్థ బుధవారం బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. ఉదాహరణకు ఫ్లూ వ్యాక్సిన్ వంధ్యత్వాన్ని(ఇన్‌ఫెర్టిలిటీ), తట్టు, గవదబిళ్ళ, రుబెల్లా నుంచి రక్షణనిచ్చే ఎంఎంఆర్ షాట్ ఆటిజానికి కారణమవుతాయని చెప్పే వీడియోలను తన పాలసీరీత్యా బ్లాక్ చేసినట్లు యూట్యూబ్ పేర్కొంది.
ఆలాబెట్ ఇన్‌కార్పొరేషన్ సొంతమైన వీడియో కంపెనీ రాబర్ట్ ఎఫ్.కెన్నడి జూనియర్, జోసఫ్ మెర్‌కోలా సహా అనేక మంది యాంటీవ్యాక్సిన్ యాక్టివిస్టులు ఛానళ్లను కూడా నిషేధిస్తున్నట్లు యూట్యూబ్ ప్రతినిధి తెలిపారు.
తమ సైట్లలో వస్తున్న తప్పుడు ఆరోగ్య సమాచారంను నివారించడానికి యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఏమిచేయడంలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో యూట్యూబ్ ఈ చర్యచేపట్టింది.