Wednesday, January 8, 2025

ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పథకాలపై సమ్మేళనాలను, పోటీలు నిర్వహించాలి
తెలంగాణ సాంస్కృతిక శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

 YouTube channel Establishment

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని అధికారులకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడానికి, తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని ఆట,పాటల ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ సాంస్కృతిక సారథి‘ సంస్థ కళాకారులను పూర్తి స్థాయిలో వారి సేవలను మరింతగా విస్తరించేందుకు సాంస్కృతిక సారథి కళాకారులకు అవగాహన సదస్సును ఈ నెల 26న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మంత్రి కెటిఆర్‌ని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నామన్నారు. కళాకారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్‌కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల కోసం అధునాతన పాటల రికార్డింగ్ స్టూడియోను నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులను సమన్వయం చేయడంలో రాష్ట్ర సమాచార శాఖ అధికారులు, జిల్లాలోని కలెక్టర్‌లు, జిల్లా పౌర సమాచార శాఖ అధికారులు పూర్తిగా సహకరించుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలపై పోటీలు నిర్వహించాలి: మంత్రి

తెలంగాణ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రభుత్వ పథకాలపై కవులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు సమ్మేళనాలను, పోటీలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జులూరి గౌరి శంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాష్ట్ర సమాచార శాఖ ఉన్నతాధికారులు కిషోర్‌బాబు, మధుసూదన్ పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News