Thursday, January 23, 2025

కెసిఆర్ మరణం గురించి రాసిన యూట్యూబ్ చానల్ పై చర్యలు తీసుకోండి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ గూర్చి సమాజంలో అశాంతి సృష్టించే విధంగా థంబ్ నెయిల్ పెట్టిన యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని సిసిఎస్ సైబర్ క్రైమ్ లో టిఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బి. దినేష్ చౌదరి పిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో న్యూస్ క్కుబ్ ఛానెల్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్ తన స్వార్ధ ప్రయోజనాలకోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు చేయడం సరికాదన్నారు. ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ప్రసారం చేస్తూ.. దానికి ముఖ్యమంత్రి కెసిఆర్ మరణం ఆ భగవంతుడు మాములుగా రాయలేదని, థంబ్ నెయిల్ పెట్టడం జరిగిందని మండిపడ్డారు

అది చూసిన సిఎం కెసిఆర్ అభిమానులు ఎంతో కలత చెందారని, తమ అభిమాన నాయకుడికి ఏమవబోతుందో అని ఆందోళనలో ఉన్నారని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా కేవలం సెన్సేషన్ కోసం బాధ్యత లేకుండా ఇటువంటి థంబ్ నెయిల్ పెట్టి సమాజంలో అశాంతికి, శాంతి భద్రతల విఘాతం కలిగించే సదరు యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను దినేష్ కోరారు. ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమకు మీడియా అన్నా, పత్రికలన్న గౌరవం ఉందని, మీడియా, యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు తమ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News