Monday, December 23, 2024

ప్రేమించి మోసం చేసిన యూట్యూబర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమించిన యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీక సంబంధం పెట్టుకున్న యూట్యూబర్‌ను నార్సింగి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… యూట్యూబర్, నటుడు చందు సాయి నార్సింగికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వివాహం చేసుకుంటానని చెప్పడంతో కొద్ది రోజుల నుంచి చందుసాయితో సదరు యువతి సన్నిహితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే 2021, ఏప్రిల్ 25వ తేదీన తన బర్త్‌డే అని చెప్పి ఇంటికి పిలిపించుకున్నాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో అది తాగిన యువతి మత్తులోకి వెళ్లింది. దీంతో యువతిపై చందుసాయి అత్యాచారం చేశాడు. మెలకువ వచ్చిన తర్వాత గమనించిన యువతికి వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి నమ్మి పోలీసులకు, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయలేదు. గత కొంత కాలం నుంచి వివాహం చేసుకోవాలని చెప్పినా కూడా చందు విషయం దాటవేస్తున్నాడు.

నిలదీసి అడిగేసరికి రూ.3కోట్లు కట్నంగా ఇస్తే వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో తాను చందుసాయి చేతిలో మోసపోయానని గ్రహించిన యువతి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు చందుపై అత్యాచారం, మోసం కింద కేసులు నమోదు చేశారు. చందుతో పాటు అతడి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా చందు అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో ఫేమస్ అయ్యాడు. చందుగాడు, పక్కింటి కుర్రాడు యూట్యాబ్ ఛానల్స్లో వీడియోలు చేస్తూ డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అతడు చేసే కామెడీ, ఎంటర్టైన్మెంట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. చందుగాడు యూట్యూబ్ ఛానల్‌కు ఐదున్నర లక్షల పైచిలుకు సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News