Wednesday, January 22, 2025

ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి

- Advertisement -
- Advertisement -

నటిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న యూట్యూబర్ హర్షసాయి హైకోర్టును ఆశ్రయిం చాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై నేడు విచారణ జరగనుంది. పోలీసుల కథనం ప్రకారం.. హర్షసాయికి ఓ పార్టీలో ముంబైకి చెందిన నటి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన హర్షసాయి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీశాడు. ఆపై వాటిని చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో నటి పోలీసులను ఆశ్రయించారు.

తనపై అత్యాచారానికి పాల్పడడంతోపాటు ఆ ఫొటోలు చూపించి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో వెల్లడించాడు. అంతేకాదు, సోషల్ మీడియాలో హర్షసాయి బెట్టింగ్ మాఫియా నడుపుతున్నట్టు ఆరోపించారు. ఆమె ఫిర్యాదు అనంతరం హర్షసాయి పరార య్యాడు. గత నెల 24న కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హర్షసాయి తాజాగా ముందుస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించాడు. కాగా, బాధిత నటి హర్షసాయితో కలిసి ఓ సినిమాలో నటించడంతోపాటు ఆ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News