Sunday, December 22, 2024

పరారీలో యూట్యూబర్ హర్షసాయి!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం నాలుగు టీమ్‌లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. అడ్వోకేట్‌తో సహా నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమె హర్ష సాయితో పాటు అతడి తండ్రిపైనా ఫిర్యాదు చేసింది. దీంతో హర్షసాయిపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. అత్యాచారంతో పాటు నగ్నచిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేయడంతో హర్షసాయిపై 376(2), 376ఎన్, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డిసిపి వెల్లడించారు.

అయితే, తనపై నార్సింగి పీఎస్‌లో నమోదైన అత్యాచార కేసుపై స్పందించిన యూట్యూబర్ హర్షసాయి.. ‘డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్‌కు తెలుసు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తననే ఆ యువతి వేధించేదని ఓ ఆడియోను కూడా విడదల చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News