Friday, December 20, 2024

పరారీలోనే హర్షసాయి

- Advertisement -
- Advertisement -

యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు హర్షసాయి మెయిల్స్ పంపిస్తూ బెదిరిస్తున్నాడని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. హర్ష తనకు కొన్ని గంటలుగా ఈ మెయిళ్లు పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నాడని హర్షపై ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు..

హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నాడు. అయితే న్యాయపరంగా పోరాటం చేస్తామని హర్ష సాయి తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. మరోవైపు ‘మెగా’ సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగికంగా వేధించారని బాధితరాలు తరఫు న్యాయవాది ఫిర్యాదు చేశారు. తన న్యాయవాదితో కలిసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితురాలి వద్ద నుంచి పోలీసులు ఆధారాలు సేకరించారు. అత్యాచారం కేసు కావడంతో పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి, అతడి ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వీడియోలతో బ్లాక్‌మేయిల్…
బాధితురాలు హర్ష సాయిని హీరోగా పెట్టి నిర్మిస్తున్న ‘మెగా’ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ఉన్నారని ఆమె లాయర్ నాగూర్ బాబు తెలిపారు. 2022లో ఒక సాంగ్ కోసం ఆమె తొలిసారి హర్ష సాయిని కలిశారన్నారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉందని, తన వద్ద ఒక స్టోరీ కూడా ఉందని బాధితురాలికి చెప్పాడన్నారు. తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడని అలా బాధితురాలు ‘మెగా’ మూవీని ఆమె సొంత డబ్బులతో ప్రారంభించారని న్యాయవాది వెల్లడించారు. స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలి అని బాధితురాలిని హర్ష సాయి కోరగ, అతని మాటలు నమ్మి బాధితురాలు హర్ష సాయి ఉండే విల్లాకు వెళ్ళినప్పుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి, ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపారు. వీడియో రికార్డ్ చేసి, మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేశాడని న్యాయవాది తెలిపారు.

కాపీ రైట్స్ కోసం…
కాగా ‘మెగా’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్‌గా రికార్డు చేసినట్లు తెలిసింది. సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News