న్యూఢిల్లీ: పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి జాతీయ రహదారి 24లో హంగామా సృష్టించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం 26ఏళ్ల యూట్యూబర్ కారు టాప్‌పై స్నేహితులతో కూర్చుని హల్‌చల్ చేశాడని, ఈ మేరకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు తెలిపారు. ఈస్ట్ ఢిల్లీ పాండవ్‌నగర్‌లో నిందితుడు ప్రిన్స్ దీక్షిత్ తన స్నేహితులతో కలిసి నిర్లక్షంగా అతివేగంగా చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
షకార్‌పూర్‌కు చెందిన ప్రిన్స్ 12వ తరగతి వరకు చదువుకున్నాడని, అతడి యూట్యూబ్ చానల్‌కు 2.68లక్షల ఫాలోవర్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రిన్స్ యూట్యూబ్ ఖాతాలో ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించిన ఉన్నాయనితెలిపారు. 1.15నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కొంతమంది యువకులు కార్ల టాప్‌పై కూర్చుని హంగామా చేయడాన్ని గుర్తించారు. గురువారం 26వ పుట్టినరోజు సందర్భంగా వీడియో చేసినట్లు ప్రిన్స్ దీక్షిత్ విచారణలో తెలిపాడు. ప్రిన్స్‌ను అరెస్టు చేసి ఓ వాహనాన్ని సీజ్ చేసినట్లు డిసిపి వెల్లడించారు.