Thursday, January 23, 2025

తమిళనాడులో ఉద్రిక్తతలు సృష్టించిన యూట్యూబర్ లొంగుబాటు!

- Advertisement -
- Advertisement -

పాట్నా: మనీశ్ కష్యప్ అనే యూట్యూబర్‌ బీహార్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తమిళనాడులో వలస బీహారీ కార్మికులపై తమిళులు దాడులు చేస్తున్నారని, చంపేస్తున్నారని ఉత్తుత్తి వీడియోలు యూట్యూబ్‌లో పెట్టి కల్లోలం సృష్టించాడీ వ్యక్తి. పశ్చిమ చెంపారన్ జిల్లాలో శనివారం అతడు పోలీసులకు లొంగిపోయాడు. బీహార్ పోలీస్‌కు చెందిన ‘ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్’ (ఈవోయూ) అతడిపై మూడు కేసులు నమోదుచేసింది. వాటిలో తమిళనాడులో బీహార్ ప్రవాస కార్మికులు కొట్టబడుతున్నారని, చంపబడుతున్నారని నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి కల్లోలం సృష్టించిన కేసు కూడా ఉంది.

కశ్యప్ బ్యాంకు ఖాతాలను ఈవోయూ స్తంభింపజేసింది. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి పాట్నా, చంపారన్‌లో ఉన్న అతడి నివాసాలపై దాడులు నిర్వహించింది. దాంతో అతడి తలలోని జేజెమ్మ దిగొచ్చింది. వేరే దారిలేక అతడు శుక్రవారం బెత్తియలోని జగదీశ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అతడి దగ్గర నుంచి 30 బూటకపు వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు బీహార్ పోలీస్(హెడ్‌క్వార్టర్స్) అదనపు డైరెక్టర్ జనరల్ జె.ఎస్. గంగ్వార్ తెలిపారు. తమిళనాడు పోలీసులు కూడా 13 కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News