Sunday, December 22, 2024

నోట్ల పిచ్చి కుదిరింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: రద్దీ ప్రాంతాల్లో డబ్బులు వెదజల్లి న్యూసెన్స్ చేసిన యూట్యూబర్‌ను కూకట్‌పల్లి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్‌పల్లి ఎసిపి వివరాలు వెల్లడించారు. యూట్యూబర్ కోరపాటి వంశీ మోడలింగ్, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే వంశీ రెండు నెలల క్రితం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై కూ కట్‌పల్లి నుంచి జెఎన్‌టియూ వైపు బుల్లెట్ బైక్‌పై వెళ్తూ కూకట్‌పల్లి మెట్రోస్టేషన్ వద్ద వంద రూపాయల నోట్లు వెదజల్లా డు. డబ్బులు కిందపడడంతో ఆ దారిలో వెళ్తున్న వారు వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. డబ్బులు వెదజల్లిన ప్రాంతంలో ట్రా ఫిక్ జాం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో గురువా రం వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

గతంలో కూ డా వంశీ ఇలాగే కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్ల పరిధి లో డబ్బులను వెదజల్లడంతో పోలీసులు కేసు నమోదు చేశా రు. బిఎన్‌ఎస్ 292, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. రీల్స్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలా చేసే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎసిపి శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News