Monday, December 23, 2024

నిత్య పెళ్లి కొడుకు గా మారిన యూట్యూబర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓ యూట్యూబర్ నిత్య పెళ్లి కొడుకు గా మారాడు. గతంలోనే మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా మరో వివాహితను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెతో సహజీవనం కూడా చేశాడు. తీరా పెళ్లి చేసుకుందామనే సమయంలో.. ఆ మహిళకు యూట్యూబర్ అసలు స్వరూపం తెలిసింది. దీంతో ఆ నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడటంతో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌‌‌లోని మెహిదిపట్నం సంతోష్ నగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ బీన్ ఇసాక్ యూట్యూబర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇసాక్‌కు గతంలోనే మూడు పెళ్లిళ్లు జరిగాయి. అయినా కూడా ఇషాక్ అమాయక మహిళలపై తన వలపు బాణాలు వేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ నెలలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మిథిలా నగర్‌లో నివాసం ఉంటున్న ఒక వివాహిత (32)తో పరిచయం ఏర్పర్చుకున్నాడు.

తనకు పెళ్లి కాలేదని, నిన్నే ప్రేమిస్తున్నాను అంటూ సినిమా డైలాగులు చెప్పి నమ్మించాడు. ఇసాక్ మాటలు ఆ వివాహిత పూర్తిగా నమ్మేసింది. ఇంకేముంది ఆమెతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో మభ్య పెట్టి ఆమెతో సహజీవనం కొనసాగించాడు. అయితే గత రెండు వారాల క్రితం సదరు వివాహితకు ఇసాక్ అసలు రూపం తెలిసింది. దీంతో ఈ విషయంపై ఆమె ఇసాక్‌ను నిలదీసింది. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకో లేక ఇసాక్ మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు కనిపించకుండా దాక్కున్నాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఈనెల 13వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బంజారా హిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. అయితే చివరికి నిందితుడు ఇసాక్‌కు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News