హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విరారణ నిమిత్తం వైఎస్‌ఆర్‌సిపి కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారుల ఎదుట అవినాష్ రెడ్డి హాజరు కావడం ఇది రెండవసారి. 2019లో కడప జిల్లా పులివేందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి చిన్నాన్న కాగా అవినాష్ రెడ్డి వరుసగా సోదరుడు అవుతారు.
జనవరి 28న మొదటిసారి సిబిఐ అధికారుల ఎదుట అవినాష్ రెడ్డి హాజరుకాగా ఆయనను నాలుగున్నర గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని గురువారం హాజరుకావాలని సిబిఐ ఆదేశించగా ఆయన కొంత వ్యవధి కావాలని కోరారు.