Monday, December 23, 2024

సిబిఐ కోర్టుకు హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకాహత్య కేసులో సిబిఐ కోర్టుకు వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి హాజరయ్యారు. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ కోర్టు గత నెల సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర రెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలపై సిబిఐ అధికారులు సిబిఐ కోర్టులో 145 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సోమవారం కోర్టు విచారణకు అప్రూవర్ గా మారిన ఏ4 దస్తగిరి మినహా మిగిలిన అందరూ హాజరయ్యారు.

చంచల్ గూడ జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లను కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. వీరందరి కంటే ముందు కోర్టుకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. తర్వాత విచారణను ప్రారంభించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News