Sunday, December 22, 2024

వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకా హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 30 వరకూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం డిసెంబర్ 1న 10.30 గంటలకు చంచల్‌గూడ్ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. కోర్టులో తన పాస్‌పోర్టును సరెండర్ చేయాలని కూడా భాస్కర్ రెడ్డిని కోర్టు ఆదేశించింది.

తన చిరునామా వివరాలను కోర్టు, సిబిఐకి ఇవ్వాలని పేర్కొంది. ఇక చికిత్సకు వెళ్లాల్సి వస్తే ఆ వివరాలను కూడా సిబిఐకి తెలపాలని స్పష్టం చేసింది. కుటుంబసభ్యులను తప్ప మిగతా ఎవ్వరినీ కలవొద్దని కూడా ఆయనను కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 20న వైఎస్ భాస్కర్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌ను మధ్యంతర బెయిల్‌గా మారుస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News