Wednesday, January 22, 2025

వైఎస్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమని ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తెలిపారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చాలా సార్లు తెలంగాణను వ్యతిరేకించారన్నారు. తెలంగాణపై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలపై నోరుజారితే బాగుండదని హెచ్చరించారు. షర్మిల ఎవరు అని, ఎప్పుడైనా  సర్పంచ్, ఎంపిటిసి, ఎంఎల్‌ఎగా గెలిచారా? అని ప్రశ్నించారు. తెలంగాణ గురించి ఆమెకు ఏం తెలుసునని దుయ్యబట్టారు.

గత ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడుతున్నామన్నారు. తాము తలుచుకుంటే షర్మిలను నల్లిని నలిపినట్టు నలుపుతామని బాల్కసుమన్ హెచ్చరించారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారని తాము తలుచుకుంటే షర్మిల లోటస్ పండ్ నుంచి అడుగు కూడా బయట పెట్టదని వార్నింగ్ ఇచ్చారు. వైఎస్‌ఆర్ కుటుంబం తెలంగాణకు బద్ధ వ్యతిరేకులని మండిపడ్డారు. షర్మిల పిచ్చి పిచ్చిగా మాట్లాడితే టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరన్నారు. తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి నీళ్లు మళ్లించిన దొంగలు వైఎస్‌ఆర్ ప్యామిలీ అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News