- Advertisement -
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్. జగన్ గురువారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ఫైల్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల తన హార్ట్ బీట్ అన్నారు. పులివెందుల ఓటర్ల మద్దతుతోనే తన పయనం కొనసాగుతోందన్నారు.
సిఎస్ఐ గ్రౌండ్ లో జగన్ ప్రసంగిస్తున్నప్పుడు ‘జై జగన్’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. జగన్ తన ప్రసంగంలో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్. షర్మీల, వైఎస్. సునీత లను విమర్శించారు. తన పినాన్న వివేకానంద రెడ్డి మరణానికి కారకులెవరో ప్రజలకు బాగా తెలుసునని జగన్ తెలిపారు. తన తండ్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి దుర్మరణానికి కుట్ర పన్నిన వారితోనే తన సోదరీమణులు చేతులు కలపడంపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అలాగే అవినాశ్ రెడ్డికి కళంకం అంటగట్టడానికి ప్రయత్నించడాన్ని కూడా ఆయన దుయ్యబట్టారు.
- Advertisement -