Sunday, December 22, 2024

భద్రత కోసం ఎపి హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్

- Advertisement -
- Advertisement -

వైసిపి అధినేత జగన్ ఎపి హైకోర్టులో పిటీషన్ వేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన పిటీషన్‌లో వెల్లడించారు. తనకు సెక్యూరిటీని పెంచాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీని ప్రస్తుత ప్రభుత్వం మార్పు చేసిందని, తనకు కేటాయించిన వాహనం కూడా సరిగా లేదని ఆయన పిటీషన్‌లో వెల్లడించారు. తనకు తగినంత సెక్యూరిటీనీ ప్రభుత్వం కల్పించేలా ఆదేశా లు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

పాత వాహనాన్ని తనకు కేటాయించారని, అందులో ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని జగన్ తెలిపారు. దీని పై హైకోర్టు రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశముందని తెలిసింది. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని ఆయన చెప్పడంతో దీని పై హైకోర్టు విచారణ జరిపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసే అవకాశాలున్నాయి. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News