Wednesday, January 22, 2025

చంద్రబాబుకు ఏదైనా జరిగితే వైఎస్.జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి నర్సింహులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే ఎపి సిఎం వైఎస్ జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి , సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పురుగుమందు డబ్బా తీసుకుని ఎన్‌టిఆర్ ఘాట్ వద్దకు ఆయన శనివారం నాడు వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. “ చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారు. ఆయన్ను హింసించి బాధపెడుతున్నారు. వైఎస్ జగన్ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సిఎం జగనే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కుటుంబానికి భద్రత లేదు. ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారు. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను సాధించాలని ప్రయత్నమా? ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి జగన్ మళ్లీ గెలవాలని చూస్తున్నారు” అని మోత్కుపల్లి మండిపడ్డారు.

Motkupally Narsimhulu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News