- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడాన్ని వైసిపి అధినేత, ఏపీ మాజీ సిఎం జగన్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదిక గా ఆయన స్పందిస్తూ తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వ రూ తీర్చలేనిదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేశారని, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని తన ట్వీట్లో వివరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా ఆయనను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు.
- Advertisement -