Wednesday, January 22, 2025

‘ఆడుదాం ఆంద్రా’ దేశ చరిత్రలో మైలురాయి: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: 15004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు జరుగుతాయని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ‘ఆడుదాం ఆంద్రా’ అనే క్రీడా పోటీలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఈ కార్యక్రమం ఊరూరా పండగలా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పాల్గొనే గొప్ప పండుగ అని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో క్రీడలు చాలా అవసరమని తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5.09 లక్షల స్పోర్ట్ కిట్ల పంపిణీ జరుగుతుందని, 47 రోజుల పాటు ఐదు దశల్లో క్రీడాల నిర్వహణ జరుగుతుందని వివరించారు. 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, ఐదు క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని జగన్ పేర్కొన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో పోటీలు జరుగనున్నాయని, అత్యధికంగా క్రికెట్‌లో 13 లక్షల మంది తన పేర్లను నమోదు చేసుకున్నారని, యోగ, మారథాన్, టెన్నీకాయిట్‌లో 16 లక్షల మంది నమోదు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News