- Advertisement -
వైసిపి అధినేత వైఎస్ జగన్ మంగళవారం విజయవాడకు రానున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోనున్న జగన్ విజయవాడ జిల్లా జైలుకు వెళ్లనున్నారు. వైసిపి నేత వల్లభనేని వంశీతో జైలులో ములాఖత్ కానున్నారు. వల్లభనేని వంశీని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ జిల్లా జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించిన సంగతి తెలిసిందే. వంశీని పరామర్శించేందుకు వల్లభనేని వంశీని పరామర్శించేందుకు ములాఖత్ ఏర్పాటు చేయాలని వైసిపి నేతలు ఇప్పటికే జిల్లా జైలు అధికారులను కోరినట్లు తెలిసింది. మంగళవారం జిల్లా జైలుకు జగన్ రానుండటంతో పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. వైసిపి నేతలు పెద్ద సంఖ్యలో రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా జైలు ప్రాంతంలో 144 సెక్షన్ విధించే అవకాశాలున్నాయి.
- Advertisement -