Wednesday, January 22, 2025

పులివెందుల‌లో సిఎం జ‌గ‌న్ గెలుపు

- Advertisement -
- Advertisement -

పులివెందుల‌లో వైసిపి అభ్య‌ర్థి సిఎం వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపొందారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, టిడిపి అభ్య‌ర్థి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి (బిటెక్ ర‌వి) పై 61,687 ఓట్ల మెజారిటీతో జ‌గ‌న్ విజ‌యం సాధించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం జ‌గ‌న్‌కు 1,16,315 ఓట్లు రాగా,  ర‌వీంద్ర‌నాథ్ రెడ్డికి 54,628 ఓట్లు పోల‌య్యాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థి ధృవ్ కుమార్ రెడ్డి 10,083 ఓట్లు ద‌క్కించుకున్నారు.

ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార వైసిపికి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ కేవ‌లం 10 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది.  2019 ఎన్నిక‌ల్లో 153 సీట్లు సాధించి ప్ర‌భంజ‌నం సృష్టించిన  వైసిపిని ఈసారి ఓట‌ర్లు తిర‌స్క‌రించార‌నే చెప్పాలి. ఈసారి  2024 ఎన్నిక‌ల్లో టిడిపి కూట‌మికి ఓట‌ర్లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News