Sunday, February 23, 2025

ఫిబ్రవరి 17న షర్మిల కుమారుడి వివాహం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరుపుతున్నామని వైటిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో రాజారెడ్డి పెళ్లి జరుగుతుందని ఆమె తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలకు షర్మిల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన తనయుడు రాజారెడ్డికి, అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ విషయం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంగళవారం తాము కుటుంబ సమేతంగా కాబోయే వధువరూలతో కలిసి ఇడుపాలపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శిస్తామని చెప్పారు. తొలి ఆహ్వాన పత్రిక అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News