Wednesday, December 25, 2024

పంట నష్టాల కింద రూ.14వేల కోట్లు ఇవ్వాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులకు రూ.14వేల కోట్లు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. నిధులు, నీళ్ళు, నియామకాలను సాధ్యం చేయాలని, ప్రజలకు రెండు సార్లు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలన్నారు.

కేజీ టూ పీజి విద్యను అమలు చేయాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.5వేల కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. నిరుద్యోగుల ఆకాంక్ష తెలంగాణ అయితే ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నారు. అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనలు నెరవేర్చాలని షర్మిల ఈ మేరకు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News