న్యూస్‌డెస్క్: వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస షర్మిల బుధవారం ట్రాన్స్‌జెండర్లకు క్షమాపణలు చెప్పారు. తమను అవమానించిన షర్మిల క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆమెను తిరగనివ్వబోమని ట్రాన్స్‌జెండర్లు హెచ్చరించిన నేపథ్యంలో షర్మిల వారికి క్షమాపణ చెప్పారు. ట్రాన్స్‌జెండర్ వర్గం పట్ల తనకు, తన పార్టీకి చాలా గౌరవమని, మాటల యుద్ధంలో తాను ఆ పదం వాడానే తప్ప వారిని అవమానించడం తన ఉద్దేశం కాదని షర్మిల వివరణ ఇచ్చారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని వారికి సేంక్షమ పథకాలు వర్తింపచేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి 18న మహబూబాబాద్‌లో పాదయాత్ర సందర్భంగా షర్మిల స్థానిక బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను హిజ్రా అంటూ సంబోధించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. తనను హిజ్రా అని అన్నందుకే తాను ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను నువ్వే హిజ్రా అని అన్నానని ఆమె తర్వాత వివరణ ఇచ్చారు.