Monday, December 23, 2024

మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న షర్మిల.. పోలీస్ స్టేషన్‌కు తరలింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సోమవారం పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అనంతరం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్‌పై షర్మిల చేయిచేసుకున్నారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా రోడ్డుపైనే కూర్చుని నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read: నిరంజన్ రెడి దత్తపుత్రుడిపై ఐటి అధికారులకు ఫిర్యాదు చేస్తా: రఘునందన్ రావు

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ”తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. నన్ను ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారో చెప్పాలి. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్తున్నా.. అడ్డుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భయపడుతున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కోర్టు అనుమతి పొందాలా. కెసిఆర్‌కు నిజాయితీ ఉంటే పేపర్ లీకేజ్‌పై సిబిఐ విచారణ జరిపించాలి” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News