Sunday, December 22, 2024

అవసరమైతే బ్రదర్ అనిల్, విజయమ్మ పోటీ చేస్తారు: షర్మిల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నకిల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. పాలేరుతో పాటు మరోచోట పోటీ చేయాలని డిమాండ్ ఉంది. బ్రదర్ అనిల్, విజయమ్మను కూడా పోటీ చేయించాలని డిమాండ్ ఉంద అన్నారు. అవసరమైతే ఇద్దరూ పోటీ చేస్తారని ఆమె తెలిపారు. కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనుకున్నామని చెప్పారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపామని, కాంగ్రెస్ నిర్ణయం కోసం నాలుగు నెలలు ఎదురు చూశామని షర్మిల తెలిపారు. కాని, అటువైపు నుంచి సరైన స్పందన లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 119 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. గట్టీ పోటీ ఇస్తందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ సంక్షేమ పాలన తీసుకొస్తామని షర్మిల పేర్కొన్నారు.

కాగా, 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి పోటీ చేసేందుకు సిద్ధమైన షర్మిల, పార్టీ గుర్తు రైతు నాగలి కోసం అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. బీ ఫారం కోసం దరఖాస్తు చేసుకోవాలని తమ నేతలకు షర్మిల సూచించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News