Monday, January 20, 2025

దళితులపై కపట ప్రేమ చూపే వారికి తగిన బుద్ధి చెప్పాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డా బిఆర్ అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని, ఆయన ఆశయాలను అమలు చేయాలని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎపిసిసి కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించాని అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఎదిరిస్తే దళితుల గుండు గీసి అవమానించారని, వంద శాతం దళితులపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన ఎందుకు కూర్చుపెట్టుకున్నారని షర్మిల ప్రశ్నించారు. ఎస్‌టి, ఎస్‌సి నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకోవడం మంచిదికాదని హితువు పలికారు. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో దళితులపై కపట ప్రేమ చూపే వారికి తగిన బుద్ధి చెప్పాలని ఎపి ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News