Wednesday, January 22, 2025

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్: షర్మిల

- Advertisement -
- Advertisement -

అమరావతి: మార్చి 1న తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ఆర్‌సిపి పోరాడిందని, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతిలో ప్రకటించారని, పదేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ఎందుకు విస్మరించిందని షర్మిల ప్రశ్నించారు. ప్రధాని మోడీ హామీ ఇచ్చిన చోటనే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించనుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో బిజెపి అడిగిందని, ఎపిని హార్డ్‌వేర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని మోడీ ఇచ్చిన విషయాన్ని ఎందుక మర్చిపోయారని ధ్వజమెత్తారు. ఎపిలో పెట్రోలియం రీసెర్చ్ సెంటర్‌ను నిర్మిస్తామని పిఎం మోడీ అన్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News