Sunday, December 22, 2024

సైబర్ క్రైం పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

తనపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై

మనతెలంగాణ, సిటిబ్యూరోః తనపై సోషల్ మీడియాలో కించపర్చేలా పెడుతున్న పోస్టులపై ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో తనను కించపర్చేలా నటి శ్రీరెడ్డి, వర్ర రవీందర్‌రెడ్డితోపాటు మరికొందరు వ్యక్తులు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మంది ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకుని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని , తనను మానసికంగా వేధిస్తున్నారంటూ వైఎస్ షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News