Monday, December 23, 2024

ఏపి ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ల కోసం 15 వందల దరఖాస్తులు : వైస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

ఏపిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల అప్లికేషన్లు వచ్చాయని పిసిసి చీఫ్ షర్మిల వెల్లడించారు. ఇందులో బి ఫామ్ లు మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే వస్తాయని తెలిపారు.టిక్కెట్ రాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించక పోతే చరిత్ర క్షమించదన్నారు.

దరకాస్తు చేసుకున్న వాళ్లపై సర్వేలు చేసి,రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేస్తున్నామన్నారు.అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది కాంగ్రెస్ పార్టీ.రీజినల్ పార్టీ కాదని, ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొనే పార్టీ కాదని, ప్రజాస్వామ్య బద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. టిక్కెట్ రాని వాళ్ళు అభ్యర్థి కోసం కాదు పార్టీ కోసం,ప్రజల కోసం,దేశం కోసం పని చేయాలని , కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలని షర్మిల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News