Monday, December 23, 2024

విజయసాయి రెడ్డికి షర్మిల కౌంటర్

- Advertisement -
- Advertisement -

జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంలో తాజాగా వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఆస్తి గొడవ అయితే పరిష్కారం చేసుకోవచ్చని, కానీ ఇది ఆస్తి గొడవ కాదని, అధికారం కోసం గొడవ అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.  చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల మీడియా సమావేశాలు పెడుతుందని, షర్మిల మీడియా సమావేశాల్లో 95 శాతం జగన్ ను విమర్శించడమే జరుగుతోందని ఆరోపించారు.

విజయసాయి వ్యాఖ్యలపై షర్మిల బదులిచ్చారు. విజయసాయి మాట్లాడిందంతా జగన్ ఇచ్చిన స్క్రిప్టేనని అన్నారు. జగన్ ఇచ్చిన స్ట్రిప్ట్ చదవలేదని విజయసాయిరెడ్డి ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు. ఆస్తుల్లో నలుగురు బిడ్డలకు వాటా అని నాడు వైఎస్సార్ కరాఖండీగా తీర్మానించారని షర్మిల స్పష్టం చేశారు. ఆస్తుల పంపకంపై వైఎస్సార్ నిర్ణయం అబద్ధమని మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా? విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు.

Vijaysai Reddy

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News