Thursday, January 23, 2025

తెలంగాణ హక్కులకోసం ఉభయసభల్లో ఉద్యమించాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల సాధన కోసం ఉభయ సభల్లో ఉద్యమించాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర పార్లమెంట్ సభ్యులకు సూచించింది. కేంద్రం మెడలు వంచుతాం అంటూ ఊబుసు పోని ప్రకటనలు కట్టిపెట్టి గట్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. స్వరాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంతో పార్లమెంట్‌లో కొట్లాడాలన్నారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ , ఖాజీపేట రైల్వేకోచ్ , గిరిజన యూనివర్శిటి వంటి వాటికోసం పోరాడాలన్నారు. బిజేపి ప్రభుత్వం ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీస్తూ పార్లమెంట్‌ను స్తంబింపచేయాలన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదాకోసం నిలదీయాలన్నారు. అసెంబ్లీ తీర్మానించిన మైనారిటీ గిరిజన రిజర్వేషన్లు ఎందుకు పెండింగ్‌లో పెట్టారో ప్రశ్నించాలన్నారు. రాష్ట్ర హక్కులకోసం పోరాడాలని షర్మిల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News