- Advertisement -
హైదరాబాద్‌ః వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్భందం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించేందుకు ఈరోజు(శుక్రవారం) ఉదయం వెళ్తుండగా.. పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆమెను హౌస్ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తొత్తుల్లా పనిచేయడం మానుకోవాలని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ తనను చూసి భయపడుతున్నారని.. అందుకే తనను ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా పోలీసుల చేత నిర్భందిస్తున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
- Advertisement -