- Advertisement -
హైదరాబాద్‌ః వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్భందం చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో దళితబంధు పథకం అమలులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల స్థానికులు ఆందోళనల చేశారు.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు ఈరోజు(శుక్రవారం) ఉదయం వెళ్తుండగా.. పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆమెను హౌస్ అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసుల ప్రవర్తపై మండిపడ్డారు. తనను నిర్భందించేందకు ఇంటికి వచ్చిన పోలీసులకు హారతి ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల ప్రవర్తనకు నిరసగా తన నివాసం వద్ద షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు దీక్ష చేస్తానని షర్మిల పేర్కొంది.
- Advertisement -