Monday, December 23, 2024

వైఎస్ షర్మిల గృహనిర్బంధం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించేందుకు ఈరోజు(శుక్రవారం) ఉదయం వెళ్తుండగా.. పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆమెను హౌస్ అరెస్టు చేశారు. ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా షర్మిల నివాసం లోటస్‌పాండ్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.

కాగా, జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో దళితబంధు పథకం అమలులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల స్థానికులు ఆందోళనల చేశారు. ఈ నేపథ్యంలో తీగుల్‌లో పర్యటించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే, గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు అనుమతి లేదని ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News