Wednesday, January 22, 2025

చంద్రబాబు నివాసానికి షర్మిల..

- Advertisement -
- Advertisement -

ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన షర్మిల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. తన కుమారుడి పెళ్లికి చంద్రబాబు దంపతులను ఆహ్వానించి, శుభలేఖ అందించారు. ఈ  సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబుతో తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యమూ లేదన్నారు. తన కుమారుడి వివాహం సందర్భంగా చంద్రబాబును ఆహ్వానించాననీ, ఈ సందర్భంగా వైఎస్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల చెప్పారు. తమ మధ్య రాజకీయంగా ఎలాంటి లావాదేవీలు లేవనీ, భవిష్యత్తులోనూ ఉండబోవనీ ఆమె తేల్చి చెప్పారు.

‘తెలంగాణ రాజకీయాలతో మీకు ఇక సంబంధం లేదా?’ అనే ప్రశ్నకు షర్మిల స్పందిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగిస్తే, ఆ బాధ్యత నెరవేర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. రాహుల్ ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న ప్రియ అట్లూరితో జరగనున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News