హైదరాబాద్ : వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమానులతో ఆత్మీ య సమావేశాల భాగంగా వైఎస్ షర్మిల ఈనెల 21న ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. 9న హైదరాబాద్లోని ఆమె నివాసం లోటస్ పాండ్లో నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయిన షర్మిల ఆ వెంటనే ఖమ్మం జిల్లా నేతలతో ఆత్మీక సమ్మేళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. య్యా రు. అయితే గ్రాడ్యుయేషన్ ఎంఎల్సి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. ఈక్రమంలో ఎంఎల్సి ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం కానున్నట్టు షర్మిల వర్గీయులు వెల్లడించారు. కాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో సమావేశాలకు లోటస్ పాండ్ సరిపోదని భావించిన షర్మిల, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 21న ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనానికి ముహూర్తం ఖరారు చేసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా పర్యటన వాయిదా వేశారు.
YS Sharmila Khammam tour postponed