Friday, January 24, 2025

సిఎం కెసిఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: వైఎస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ వైఎస్సార్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంతోపాటు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై వైఎస్ షర్మిల చర్చించినట్లు తెలుస్తోంది. బేటీ అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీలతో నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుందని, సిఎం కెసిఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చెప్పారు. పార్టీ విలీనంపై త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆమె పేర్కొన్నారు.

Also Read: మెగా డిఎస్‌సి కాదు…దగా డిఎస్‌సి : రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News