Monday, December 23, 2024

వైఎస్ షర్మిలతో వైఎస్ వివేకానంద కుమార్తె సునీత భేటీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. షర్మిల ఎపిసిసి అధ్యక్షురాలు అయినప్పటి నుంచి ఆంధ్రాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ భేటీలో సునీతో షర్మిల రాజకీయ అంశాలపై ఎక్కువగా చర్చించినట్టు సమాచారం. పిసిసి అధ్యక్షురాలు అయిన తరువాత సునీతను షర్మిల కలవడం ఇదే మొదటిసారి. సునీత కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరగడంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తన తండ్రి హత్యపై నిందితులతో సునీత పోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్య కేసును సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లడమే కాకుండా సిబిఐతో విచారణ కోరడం జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఎంపి అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డిని గుర్తించారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతర నిందితులు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అవినాష్ రెడ్డి మాత్రం బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కొవడం కోసం ఆమె రాజకీయ ఆరంగ్రేటం చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News