Monday, December 23, 2024

ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్‌ఆర్ పేరు.. షర్మిల కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై జరుగుతున్న చర్చలపై తాజాగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయని ఆమె మీడియాతో వెల్లడించారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (వైఎస్‌ఆర్‌)పై సోనియాకు ఎంతో గౌరవం ఉందని, అందుకే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో తాను మాట్లాడానని షర్మిల పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)లో వైఎస్ఆర్ పేరును చేర్చిన విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది.. సోనియా గాంధీ అని మా వాళ్లే నన్ను ప్రశ్నించారని షర్మిల తెలిపారు. ఆదే అంశం సోనియా దగ్గర ప్రస్తావనకు తెచ్చానని చెప్పారు. ఇది సోనియాకు తెలియకుండా జరిగిందని ఆమె పేర్కొంది. రాజీవ్‌గాంధీ మరణించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని, సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) చార్జ్ షీట్‌లో ఆయన పేరు చేర్చారని సోనియా చెప్పారని ఆమె పేర్కొన్నారు.

ఆ బాధ ఎంటో తమకు తెలుసని సోనియా అన్నారన్న విషయాన్ని షర్మిల వెల్లడించారు. మాకు తెలిసి తెలిసి అలాంటి అవమానం ఎలా చేస్తామన్నారని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ లేని లోటు ఇప్పుడు తెలుస్తుందని సోనియా చెప్పారు. వైఎస్సార్ ను సోనియా, రాహుల్ గాంధీ అపారంగా గౌరవిస్తున్నారన్నారు. నిర్ధారణకు వచ్చాకే సోనియా, రాహుల్ తో చర్చలు జరిపానని చెప్పారు. సోనియా, రాహుల్ రియలైజేషన్ కి వచ్చారని తెలిపారు. అర్థ చేసుకోవాల్సిన బాధ్యత నాది అన్న షర్మిల పాలేరులో పోటీ అంశం త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News